ముంబై, ఫిబ్రవరి 5: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా సోమవారం ఓ సరికొత్త ప్లాన్ను పరిచయం చేసింది. ఇండెక్స్ ప్లస్ పేరిట యూనిట్ లింక్డ్, రెగ్యులర్ ప్రీమియం, ఇండివీడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది.
జీవిత బీమా కవరేజీతోపాటు కాలపరిమితి మొత్తంగా సేవింగ్స్కూ ఈ ప్లాన్ దోహదం చేస్తుందని ఓ ప్రకటనలో ఎల్ఐసీ పేర్కొన్నది. అలాగే షరతులకు లోబడి ఐదేండ్ల లాకిన్ పీరియడ్ అనంతరం ఎప్పుడైనా యూనిట్ల పాక్షిక ఉపసంహరణకు వీలున్నది. గ్యారంటీడ్ అడిషన్స్ కూడా ఉంటాయి.