Public Sector Banks | ప్రభుత్వరంగ బ్యాంకుల (PSB’s) లాభాలబాట పడుతున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. వాటి ఆస్తులపై రాబడి (ROA) ఒకశాతానికిపైగా పెరిగింది. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్, ఇంప్రూవ్డ్ అసెట్స్ క్వాలిటీ, స్టేబుల్ క్రెడిట్ గ్రోత్ కారణంగా లాభాలు పెరిగేందుకు ఉపకరించాయని నివేదిక పేర్కొంది. పీఎస్బీ రంగ బ్యాంకుల మొత్తం లాభాలు రికార్డు స్థాయిలో రూ.1.5లక్షలకోట్లకు చేరాయని నివేదిక తెలిపింది. కవర్ చేయబడిన బ్యాంకుల మొత్తం ఆదాయాలు 2026-28 ఆర్థిక సంవత్సరం వరకు మిశ్రమ వార్షిక వృద్ధి రేటు (CAGR) పెరుగుతుందని అంచనా.
నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (NIM) సమీపకాలంలో ఒత్తిడిలో ఉన్నప్పటికీ.. పెరుగుతున్న ఫీజు ఆదాయం, వ్యయ నిష్పత్తిలో క్రమంగా మెరుగుదల, హెల్తీ కవరేజ్ లెవల్స్ (PCR దాదాపు 79 శాతం) ఆస్తులపై రాబడిని 1.0-1.1శాతం వద్ద స్థిరమైన స్థాయిలో నిర్వహించేందుకు సహాయపడుతాయని నివేదిక తెలిపింది. బలమైన డిపాజిట్ ఫ్రాంచైజీలు, సాంప్రదాయిక రుణం-డిపాజిట్ రేషియోస్, రిటైల్, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న-మధ్యతరహా సంస్థలు (MSME) రంగాలలో స్థిరమైన వృద్ధి సైతం ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాల వేగాన్ని పెంచాయి. 15 సంవత్సరాలలో మొదటిసారిగా ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులను అధిగమించాయని, ప్రైవేట్ రుణదాతల 10 శాతం వృద్ధితో పోలిస్తే 12 శాతం వృద్ధిని నమోదు చేశాయని నివేదిక పేర్కొంది.
2020 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎస్బీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు ఐదు రెట్లు పెరిగింది. యావరేట్ రిటర్న్ ఆఫ్ ఈక్విటీ (ROE ) 18 నుంచి 19 శాతం వద్ద స్థిరంగా ఉన్నది. ఆస్తులపై రాబడి (ROA)లో ఒకశాతం రికవరీ ఒకేసారి వచ్చే సంఘటన కాదని.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి వచ్చే అవకాశమని నివేదిక పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మార్జిన్లు మెరుగుపడడం, ఆస్తి నాణ్యత స్థిరంగా ఉండడంతో రాబోయే సంవత్సరాల్లో స్థిరమైన రాబడిని అందించడానికి మంచి స్థితిలో ఉన్నాయని నివేదిక తెలిపింది.