Poco X6 Series | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన ఎక్స్6 సిరీస్ ఫోన్లు.. పోకో ఎక్స్6 ప్రో, పోకో ఎక్స్6 ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. జియోమీ హైపర్ ఓఎస్ వర్షన్‌తో పని చేస్తున్న ఈ ఫోన్లు 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ షియోమీ హైపర్ ఓఎస్ వర్షన్‌తో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన తొలి స్మార్ట్ ఫోన్లుగా పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో నిలిచాయి.
పోకో ఎక్స్6 ప్రో (Poco X6 Pro) ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ఆల్ట్రా ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తున్నది. ఆల్ గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్ ల కోసం మాలీ-జీ615 జీపీయూ ఫీచర్ జత చేశారు.
64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ షియోమీ హైపర్ఓఎస్ ఫీచర్ జత చేశారు. అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్లు జత చేశారు.
పోకో ఎక్స్6 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటది. 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అందుబాటులో ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రోసెసర్ తో వస్తున్నది. గ్రాఫిక్ ఇంటెన్సివ్ టాస్క్ కోసం ఆడ్రెనో 710 జీపీయూ ఉంటుంది. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ సపోర్ట్ ఫర్ ఓఐఎస్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 16 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ సెన్సర్ ఉంటాయి. ఇక 67 వాట్ల ఫాస్ట్ చార్జర్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ పని చేస్తుంది.
పోకో ఎక్స్6 ప్రో ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ రూ.24,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ రూ.26,999 పలుకుతుంది. పోకో ఎల్లో, రేసింగ్ గ్రే, స్పెక్ట్రే బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఇక పోకో ఎక్స్6 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999లకు లభిస్తాయి. మిర్రర్ బ్లాక్, స్నోస్టోర్మ్ వైట్ కలర్ ఆప్షన్లలో పొందొచ్చు.
ఈ నెల 16 నుంచి పొకో ఎక్స్ 6 సిరీస్ ఫోన్లు కంపెనీ వెబ్ సైట్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ లో లభిస్తాయి. గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాక్ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.2000, ఎక్స్చేంజ్ బోనస్ కింద మరో రూ.2000 డిస్కౌంట్ పొందొచ్చు.