Poco C61 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో సీ61 (Poco C61) ఫోన్‌పై ఆఫర్ ప్రకటించింది. తొలిరోజు బుక్ చేసుకున్న వారికి రూ.500 కన్జూమర్ ఆఫర్ కూపన్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా పోకో సీ61 (Poco C61) ఫోన్ విక్రయాలు జరుగుతాయి. పోకో సీ61 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999లకు లభిస్తుంది. ఫస్ట్ డే సేల్ తర్వాత 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ రూ.7,499, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499లకు లభిస్తుంది. పోకో సీ61 ఫోన్ డైమండ్ డస్ట్ బ్లాక్, ఎథరియల్ బ్లూ, మైస్టికల్ గ్రీన్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న పోకో సీ61 ఫోన్లో రేడియంట్ రింగ్ డిజైన్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా నెలకు రూ.625 ఈఎంఐ ఆప్షన్‌తో సొంతం చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ యూఐ ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తున్న పోకో సీ61 ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.71 అంగుళాల హెచ్డీ+ (1650×720 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటది. మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుందీ ఫోన్.
పోకో సీ61 ఫోన్ 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు అన్ స్పెసిఫైడ్ ఏఐ బ్యాక్డ్ సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రేర్ కెమెరా యూనిట్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తో వస్తోంది. 10వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, బయో మెట్రిక్ అథంటికేషన్ కం సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటది.