Poco C61 | బడ్జెట్ ధరలో పోకో సీ61.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Poco C61 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో సీ61 ఫోన్‌ను ఈ నెల 26న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Poco C61 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో సీ61 ఫోన్‌ను ఈ నెల 26న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తోపాటు 6.71 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్ తో వస్తుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంటుందీ ఫోన్. మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్ సెట్, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ కెపాసిటీతో వస్తుంది. పోకో సీ61 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,499, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499 పలుకుతుంది.
పోకో సీ61 ఫోన్ 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటది. 10 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయిస్తారు. 6జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 6జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. రెడ్మీ ఏ3 ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో సీ61గా రిలీజ్ చేస్తున్నారని తెలుస్తున్నది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

