న్యూఢిల్లీ : పోకో ఇండియా హెడ్‌గా హిమాన్షు టాండన్‌ను కంపెనీ నియమించింది. అనూజ్ శర్మ షియామి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా గతవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం పోకో ఇండియా నూతన కంట్రీ హెడ్‌ను నియమించింది. పోకో వ్యవస్ధాపక బృందంలో ఒకరైన టాండన్‌కు కంపెనీ కీలక బాధ్యతలు అప్పగించింది.
పోకో ఇండియా హెడ్‌గా యువకుడు, నూతన తరం నేత హిమాన్షు టాండన్‌ను ఎంపిక చేశామని, పోకో వ్యవస్ధాపక బృందంలో సభ్యుడిగా టాండన్ కంపెనీ విస్తరణ, బ్రాండ్ ఎదుగుదలకు తోడ్పాటు అందించారని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
2021 ప్రధమార్ధంలో పోకో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్‌గా, ఆన్లైన్లో నెంబర్ 3 బ్రాండ్‌గా ఎదగడంలో హిమాన్షు టాండన్ పాత్రీ కీలకమని తెలిపింది. 2000కు పైగా సర్వీస్ సెంటర్లతో దేశవ్యాప్తంగా కస్టమర్లకు మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని పోకో పేర్కొంది.