న్యూఢిల్లీ, ఆగస్టు 21 : పంజాబ్ నేషనల్ బ్యాంక్..దేశీయ భద్రతా దళాల కోసం ప్రత్యేకంగా రెండు క్రెడిట్ కార్డులను జారీ చేసింది. ఇందుకోసం ఇండియన్ ఆర్మీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. వీటిలో ఆర్మీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగుల కోసం పీఎన్బీ లక్సరా మెటల్ క్రెడిట్ కార్డును, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగుల కోసం పీఎన్బీ పరాక్రమ్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కార్డులు క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అవుట్లెట్లలో కొనుగోళ్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్, దేశీయ-అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్‌లకు ఉచిత ప్రవేశం, జీరో ఫారెక్స్ మార్కప్, ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఉచితం వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది.