లండన్ : ఏ వంటకానికైనా టమాట తగిలిస్తేనే రుచికరంగా ఉంటుంది. డిష్ ఏదైనా టమాట టచ్ చేయాల్సిందే. అయితే టమాటల ధరలు (Inflation ) చుక్కలు చూస్తుండటంతో బ్రిటన్‌లోని పలు రెస్టారెంట్ల కిచెన్‌లో టమాటకు చోటు దక్కడం లేదు. టమాట లేకుండానే పిజా, పాస్తాలను విక్రయిస్తున్నారు. ఇటాలియన్ క్యూజిన్లో విధిగా కనిపించే టమాట ధరలు ఆకాశాన్ని తాకడంతో ఇది లేకుండానే వంటకాలు సిద్ధం చేయాల్సి వస్తోందని ఇటాలియన్ చెఫ్స్ అసోసియేషన్ ఎఫ్ఐసీ ప్రెసిడెంట ఎంజో ఒలివెరి పేర్కొన్నారు.
టమాటాల సరఫరా తగ్గడంతో ఈ కూరగాయకు విపరీతమైన కొరత నెలకొందని చెప్పారు. టమాటాలు ఏ ప్రాంతం నుంచి రావడం లేదని అన్నారు. టమాట వేయని పిజాలు, పాస్తా డిషెస్‌ను రెస్టారెంట్లు ఆఫర్ చేస్తుండగా మరికొన్ని రెస్టారెంట్లు మెనూల నుంచి ఆయా డిష్‌లను తొలగిస్తున్నాయి.
టమాట కొరతతో ధరలు మండిపోతున్నందున ప్రత్యామ్నాయం లేక ఇలా చేయాల్సి వస్తోందని ఒలివెరీ తెలిపారు. రెస్టారెంట్లలోనే కాదు బ్రిటన్ అంతటా సూపర్ మార్కెట్లలోనూ కొరత కారణంగా టమాట సహా కొన్ని పండ్లు, కూరగాయలను పరిమితంగా విక్రయిస్తున్నారు. టెస్కో, అస్ధా, అల్ధి, మారిసన్స్ వంటి ప్రముఖ సూపర్మార్కెట్లు టమాటాలు, ఇతర కూరగాయల విక్రయంపై కస్టమర్లకు పరిమితి విధిస్తున్నాయి.
Read More :
Tea | ఛాయ్ అంటే ఇష్టం ఉంటే సరే.. కానీ అదే పనిగా కప్పులు కప్పులు తాగొద్దని చెప్పే చిట్టి కథ