Phonepe | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్‌పే నిరంతరం యూజర్ల అవసరాల కోసం సరికొత్త ఫీచర్లు తెస్తోంది. కొత్తగా ‘క్రెడిట్’ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో సంబంధిత వ్యక్తులు తమ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ కూడా ఫ్రీగానే తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ సాయంతో క్రెడిట్ కార్డుల నిర్వహణ, బిల్లు, రుణ వాయిదాల చెల్లింపు తదితర అంశాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చునని ఫోన్‌పే పేర్కొన్నది.
ఫోన్‌పే యూజర్లు యాప్ ఓపెన్ చేయగానే హోం పేజీలో క్రెడిట్ ట్యాబ్ కనిపిస్తుంది. అది కనిపించకుంటే యాప్ అప్ డేట్ చేసుకోవాలి.. ఆ ‘క్రెడిట్’ పై క్లిక్ చేస్తే వచ్చే ‘క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ’ అనే ఆప్షన్ కింద కనిపించే ‘చెక్ నౌ’ అనే ట్యాబ్ క్లిక్ చేస్తే సరి.. మీ క్రెడిట్ స్కోర్ చెబుతుంది. ఈ క్రెడిట్ స్కోర్ తోపాటు సకాలంలో పేమెంట్స్, క్రెడిట్ వినియోగ నిష్పత్తి, లోన్ ఎంక్వయిరీ తదితర అంశాలూ తెలుసుకోవచ్చు.
ఇదే క్రెడిట్ ఫీచర్లో మూడు ఆప్షన్లు – మేనేజ్ క్రెడిట్, లోన్ ప్రొఫైల్, పేమెంట్ డ్యూస్ ఉంటాయి. వీటితో క్రెడిట్ కార్డుల నిర్వహణ, లోన్ పేమెంట్స్ సమాచారం సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని ఫోన్ పే వెల్లడించింది. మనకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.