హరిద్వార్, మార్చి 18: ప్రపంచ ప్రతిష్ఠాత్మక ప్రచురణ సంస్థ ‘నేచర్ పోర్ట్‌ఫోలియో’కు చెందిన ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో గత ఏడాదికిగాను వచ్చిన టాప్-100 రిసెర్చ్ పేపర్లలో పతంజలి ఆయుర్వేద్ రిసెర్చ్ అయిన ‘రెనోగ్రిట్’ ఆయుర్వేద ఔషధం పరిశోధనాంశాలు కూడా ఉన్నాయి. యోగ్ ఋషి స్వామీ రాందేవ్ జీ ఆదర్శంతో తమ శాస్త్రవేత్తలు పరిశోధించి ఆవిష్కరించిన ఈ హెర్బల్ ఫార్ములేషన్‌కు అంతర్జాతీయ సైంటిఫిక్ గుర్తింపు లభించడంపట్ల పతంజలి యోగ్‌పీఠ్ ట్రస్ట్ ఆనందం వ్యక్తం చేసింది.
ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదలైంది. 2,568సార్లు రెనోగ్రిట్ రిసెర్చ్ పేపర్‌ను డౌన్లోడ్ చేశారని ఈ సందర్భంగా తెలిపింది. తీవ్రమైన కిడ్నీ వ్యాధులపై ఓ సాధారణ మూలికా ఔషధం.. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రభావవంతంగా పనిచేస్తున్నదనడానికి ఇదో నిదర్శనమన్నది.