గృహ రుణం తీర్చేశారా?
అత్యవసరాలు.. మీ దగ్గర నగదు లేదని ఆగిపోవు. కాబట్టి ఎప్పుడూ అత్యవసర నిధిని తక్కువగా అంచనా వేయవద్దు. ఇక కచ్చితంగా మీ ఆరు నెలల ఖర్చులను సులభంగా తీర్చుకునేలా మీ అత్యవసర నిధి అనేది ఉండాలన్నది మర్చిపోవద్దు.
- మిగిలే ఈఎంఐ సొమ్మును వాడుకోండిలా..
మీకున్న గృహ రుణాన్ని తీర్చేశారా? మరో రుణాన్ని తీసుకోవాలనుకోవడం లేదా? మరి.. నెలనెలా మిగులుతున్న ఆ హోమ్ లోన్ ఈఎంఐని ఇలా తెలివిగా వాడుకోండి.
అత్యవసర నిధి
అత్యవసరాలు.. మీ దగ్గర నగదు లేదని ఆగిపోవు. కాబట్టి ఎప్పుడూ అత్యవసర నిధిని తక్కువగా అంచనా వేయవద్దు. ఇక కచ్చితంగా మీ ఆరు నెలల ఖర్చులను సులభంగా తీర్చుకునేలా మీ అత్యవసర నిధి అనేది ఉండాలన్నది మర్చిపోవద్దు. ఒకవేళ మీపై ఆధారపడ్డవారు ఉంటే, ఉద్యోగ భద్రత లేనిచోట పనిచేస్తున్నైట్టెతే 9-12 నెలలకు సరిపడా ఎమర్జన్సీ ఫండ్ ఉండాలి. ఇంట్లో పెద్దవారుంటే.. వారి వైద్య ఖర్చులకు అదనపు నిధులు అవసరమవుతాయని గుర్తుంచుకోండి.
అధిక వడ్డీ రుణాలొద్దు
వ్యక్తిగత రుణాలు, ఇతరత్రా అధిక వడ్డీభారం కలిగిన లోన్లుంటే వాటిని తీర్చేయడం మంచిది. అలాగే క్రెడిట్ కార్డ్ బకాయిలనూ తీర్చేయాలి. వీలైనంత వరకు రుణ విముక్తికే ప్రాధాన్యం ఇవ్వాలి. అనవసరమైన ఖర్చులు వద్దు. అవసరమైతేనే లోన్లకు ప్రయత్నించాలి.
సమగ్రమైన బీమా
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీమా అనేది చాలా ముఖ్యం. అయితే దీన్నో సేవింగ్స్‌గా మాత్రం చూడవద్దు. చాలామంది ఏదో బీమా ఉందా? అంటే ఉంది అన్నట్టు మొక్కుబడిగా పాలసీలు తీసుకుంటారు. కానీ జీవిత బీమా అయినా.. ఆరోగ్య బీమా అయినా.. మన అవసరాలకు సరిపడా ఉండాలి. కనుక బీమా మొత్తాలను పెంచుకోవడానికి ప్రయత్నించండి. టర్మ్ లైఫ్ కవరేజీని పరిశీలించండి.
పొదుపు-పెట్టుబడులు
భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు-పెట్టుబడులకు పెద్దపీట వేయాలి. పిల్లల చదు వు, పెండ్లిళ్లు.. మన పదవీ విరమణ అనంతర జీవితకాలం కోసమూ కూడబెట్టాలి. ఇందుకు బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) దగ్గర్నుంచి స్టాక్ మార్కెట్ ఆధారిత పెట్టుబడులు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఇతర ప్రభుత్వ పథకాల వరకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. కనుక నిపుణుల సలహాతో ముందుకెళ్తే ఆకర్షణీయ రాబడులను అందుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

