Oppo K11 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన కే సిరీస్ ఫోన్ ‘ఒప్పో కే11 5జీ (Oppo K11 5G) మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ గల ఈ ఫోన్ చైనాలో మంగళవారం ఆవిష్కరించారు. ఒక్టాకోర్ 6ఎన్ఎం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 782జీ ఎస్వోసీ చిప్ సెట్‌తోపాటు త్రీ రామ్ అండ్ స్టోరేజీ వేరియంట్లతో వస్తున్నది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కల ఒప్పో కే11 5జీ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 100 వాట్ల సూపర్ చార్జింగ్ కలిగి ఉంటుంది. పది నిమిషాల్లో 50 శాతం, 26 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
ఒప్పో కే11 5జీ ఫోన్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.21 వేలు (1899 చైనా యువాన్లు) పలుకుతుంది. 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.24 వేలు (2099 చైనా యువాన్లు), టాప్ హై ఎండ్ వేరియంట్ ఫోన్ 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.29,000 (2499 చైనా యువాన్లు) పలుకుతుంది. ఈ ఫోన్ గ్లాసియర్ బ్లూ, మూన్ షాడో గ్రే కలర్స్ లో లభిస్తుంది.
డ్యుయల్ సిమ్ (నానో) ఆప్షన్ గల ఒప్పో కే11 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ ఓఎస్ 13.1 వర్షన్ మీద పని చేస్తుంది. 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080x 2412 పిక్సెల్స్) ఓలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 240 హెర్ట్జ్ టచ్ శాంపింగ్ రేట్ కలిగి ఉంటుంది. 1100 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఆన్ బోర్డ్ మెమరీని 12 జీబీ రామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు.
ఒప్పో కే11 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ ఐఎంఎక్స్890 సెన్సర్ విత్ ఎఫ్/1.8 అపెర్చర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) కలిగి ఉంటుంది. ఇంకా 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్, సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటది. వై-ఫై, బ్లూ టూత్ 5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటది. యాక్సిలో మీటర్, కలర్ టెంపరేచర్ సెన్సర్, ఐఆర్ కంట్రోల్, గ్రావిటీ సెన్సర్, లైట్ సెన్సర్, గైరో స్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్ తోపాటు బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.