Oppo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో ఏ1ఎస్, ఒప్పో ఏ1ఐ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ సెట్, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. రెండు ఫోన్లూ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటాయి. ఒప్పో ఏ1ఎస్ డ్యుయల్ రేర్ కెమెరా, ఒప్పో ఏ1ఐ సింగిల్ రేర్ కెమెరాతో వస్తున్నది. చైనా మార్కెట్లో మంగళవారం ఈ రెండు ఫోన్లను ఆవిష్కరించారు.
ఒప్పో ఏ1ఎస్ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.13,800 (1199 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.16,100 (1399 చైనా యువాన్లు) పలుకుతుంది. మౌంటెడ్ పర్పుల్, నైట్ సీ బ్లాక్, టైటాన్ షౌబీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఒప్పో ఏ1ఐ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.12,700 (1099 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.13,800 (1199 చైనా యువాన్లు) ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ నైట్ బ్లాక్, ఫాంటోమ్ పర్పుల్ కలర్స్ లో లభిస్తుంది.
ఒప్పో ఏ1ఎస్ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.72 అంగుళాల హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ డిస్ ప్లేతో వస్తున్నది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమరా ఉంటది. 33 వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది. 4జీ, వై-ఫై5, బ్లూటూత్, బైదూ, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
ఒప్పో ఏ1ఐ ఫోన్ 6.56 అంగుళాల హెచ్డీ+ (1612×720 పిక్సెల్స్) ఎల్సీడీ ఫ్రంట్ ప్యానల్ ఉంటుంది. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 90 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటుకు మద్దతుగా నిలుస్తుంది. ఒప్పో ఏ1ఐ ఫోన్ 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 5-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 10వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది. ఒప్పో ఏ1ఎస్ ఫోన్ లో మాదిరే సెక్యూరిటీ, కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.