OnePlus | భారత మార్కెట్లోకి కొత్తగా N6 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన వన్‌ప్లస్.. ధర ఎంతంటే..!
OnePlus | భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ (OnePlus ) కొత్త N6 స్మార్ట్‌ఫోన్ (Smart phone) ను విడుదల చేసింది. నార్డ్ సిరీస్‌కు దిగువ స్థాయిలో తీసుకొచ్చిన తొలి ‘N’ సిరీస్ ఫోన్ ఇదే. భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, తాజా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ N6 ప్రారంభ ధర రూ.22,999గా నిర్ణయించింది.
OnePlus : భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ (OnePlus ) కొత్త N6 స్మార్ట్‌ఫోన్ (Smart phone) ను విడుదల చేసింది. నార్డ్ సిరీస్‌కు దిగువ స్థాయిలో తీసుకొచ్చిన తొలి ‘N’ సిరీస్ ఫోన్ ఇదే. భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, తాజా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ N6 ప్రారంభ ధర రూ.22,999గా నిర్ణయించింది. ఇందులో 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 గా డిసైడ్ చేశారు.
అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా రూ.1,000 ప్రత్యేక తగ్గింపుతోపాటు యాక్సిస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై మరో రూ.2,000 తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. జూలై 4 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్లో 6.75 అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తోపాటు గరిష్ఠంగా 1,200 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16తో ఫోన్ వస్తోంది. రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్‌ను అమర్చారు. వేడి తగ్గించేందుకు పెద్ద వేపర్ చాంబర్ కూలింగ్ వ్యవస్థను కూడా అమర్చింది. ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌లో 60 ఎఫ్‌పీఎస్ వరకు వీడియోలు రికార్డ్ చేయవచ్చు.
డ్యూయల్ వ్యూ వీడియో మోడ్ కూడా ఈ కొత్త ఫోన్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్లోని 8,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణ. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ నిలుస్తుందని కంపెనీ పేర్కొన్నది. 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తోపాటు 6.5 వాట్ల రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఉంది. ఐపీ65 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తోపాటు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

