Ola S1 X | ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర తగ్గింపు.. ఎంత తగ్గించారంటే..?!
Ola S1 X | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఎంట్రీ లెవల్ స్కూటర్ ఎస్1 ఎక్స్ (S1X) ధరను భారీగా తగ్గించింది.
Ola S1 X | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఎంట్రీ లెవల్ స్కూటర్ ఎస్1 ఎక్స్ (S1X) ధరను భారీగా తగ్గించింది. లాంచింగ్ ధర రూ.79,999 (ఎక్స్ షోరూమ్) కాగా, ప్రస్తుతం రూ.69,999లకే లభిస్తుంది. ఓలా ఎస్1 ఎక్స్ సిరీస్ ఈవీ స్కూటర్ల ధరలన్నీ రూ.4,000 నుంచి రూ.10000 వేల మధ్య తగ్గించింది. ఈ మేరకు తగ్గించిన ధరలతో బుక్ చేసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్లను వచ్చేవారంలో డెలివరీ చేస్తామని తెలిపింది.
దేశ ప్రజలందరినీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లించేందుకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను మరింత తగ్గించినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఎస్1ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లకు అనుగుణంగా మూడు వేర్వేరు వేరియంట్లలో లభిస్తున్నది. 2కిలోవాట్ల బ్యాటరీ పవర్డ్ వేరియంట్ ఓలా ఎస్1 ఎక్స్ స్కూటర్ రూ.79,999 నుంచి రూ.69,999లకు, 3కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ రూ.89,999 నుంచి రూ.84,999, నాలుగు కిలోవాట్ల బ్యాటరీ పవర్డ్ వేరియంట్ రూ.1,09,999 నుంచి రూ.99,999లకు తగ్గించింది.
ఓలా ఎస్1 ఎక్స్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లతోపాటు ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్, ఎస్1ఎక్స్+ స్కూటర్లను ఆవిష్కరించింది. శరవేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు ఓలా ఎలక్ట్రిక్ ప్రయత్నిస్తున్నది. తాజాగా నాలుగు వేర్వేరు ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ల తయారీపై ఓలా ఎలక్ట్రిక్ ఫోకస్ చేస్తున్నది. ఈ ఏడాది చివరిలోగా ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది. అంతే కాదు ఎలక్ట్రిక్ కారు తయారీపైనా కేంద్రీకరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

