Ola S1 scooter | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 వేరియంట్ వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నది. బుధవారం (సెప్టెంబర్ 8) నుంచి వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు. రూ.2999 ఈఎంఐతో ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. గత నెల 15న ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్.. ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్ స్కూటర్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఎస్1 స్కూటర్ రూ.99,999, ఎస్ 1 ప్రో స్కూటర్ రూ.1,29,999లకు లభించనున్నది. వచ్చే నెల నుంచి ఓలా ఎలక్ట్రిక్ ఈ స్కూటర్లను డెలివరీ చేస్తామని ప్రకటించింది.
ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్లు స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆకర్షణీయమైన రుణ పరపతి కోసం అగ్రశ్రేణి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా, టాటా క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌లు వెహికల్ రుణాలందిస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Back pain | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Mirnalini Ravi | అందాలతో అదరగొడుతున్న మృణాళిని రవి
హెల్త్ ఇన్సూరెన్స్ క్లైయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి ? ఎవరిని సంప్రదించాలి
గుడ్డి నిర్ణయాలొద్దు.. నీట్‌ను వాయిదా వేయండి..!