Kia Seltos Facelift |దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన మిడ్ సైడ్ ఎస్యూవీ సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) అఫిషియల్ టీజర్ విడుదల చేసింది. ఇందులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్లతో కూడిన ఫీచర్లు బయట పెట్టింది. వచ్చే మంగళవారం భారత్ మార్కెట్లో సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ (Kia Seltos Facelift) లాంచ్ కాబోతున్నది. దీని ధర రూ.10 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం కానున్నది.
మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara), హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), స్కోడా కుషాక్ (Skoda Kushaq), టయోటా హై రైడర్ (Toyota Hyrider), ఫోక్స్ వ్యాగన్ టైగూన్ (Volkswagen Tigun), ఎంజీ ఆస్టర్ (MG Aster)తోపాటు త్వరలో మార్కెట్లోకి రానున్న సిట్రోన్ సీ ఎయిర్ క్రాస్ (Citroën C3 Aircross) లకు కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) గట్టి పోటీ ఇవ్వనున్నది.
కియా ఇండియా తన సెల్టోస్ మోడల్ కారును నాలుగేండ్ల తర్వాత అప్ డేట్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సెల్టోస్ కారుతో పోలిస్తే 2023 – సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ (Kia Seltos Facelift) పలు మార్పులు జరుగనున్నాయి. ఓఆర్వీఎం (ORVM) తోపాటు న్యూలీ డిజైన్డ్ గ్రిల్లె ఇన్ ది ఫ్రంట్ ప్రొఫైల్, స్లీక్ లుకింగ్ ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్స్- LED Daytime Running Lamps (DRLs), ఫ్రంట్ డీఆర్ఎల్ మాదిరిగా మిడిల్ వరకు న్యూ ఎల్ఈడీ టెయిల్ లైట్ (LED tail light) సెటప్ చొచ్చుకు వస్తుంది.
డ్యుయల్ డిజిటల్ కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ (Digital Color TFT instrument Cluster), డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ మాదిరిగా స్టీరింగ్ వీల్‌తోపాటు దిగువన న్యూ సెంట్రల్ ఏసీ వెంట్స్ లో మార్పులు చేశారు. డ్యుయల్ పనోరమిక్ సన్‌రూఫ్ (Dual-Panoramic Sunroof) కలిగి ఉంటుంది.
2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) ప్రస్తుత మోడల్ సెల్టోస్ మాదిరిగా 1.5 లీటర్ల 4- సిలిండర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో వస్తోంది. ఇంజిన్ గరిష్టంగా 115 పీఎస్ (పెట్రోల్), 116 పీఎస్ (డీజిల్) విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్‌లో 6-స్పీడ్ ఎంటీ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్, డీజిల్ వేరియంట్లో 6-స్పీడ్ ఐఎంటీ, 6-స్పీడ్ ఏటీ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది.
త్వరలో వస్తున్న కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ (Kia Seltos Facelift) లో 1.4 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ స్థానే 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 160 పీఎస్ విద్యుత్, 253 ఎన్ఎం టార్చి, 6-స్పీడ్ ఐఎంటీ, 7-స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి.
ఇంకా అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ తోపాటు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ తదితర ఫీచర్లు కూడా ఉంటాయి.
సేఫ్టీ కోసం 6- ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిస్కెంట్ కంట్రోల్, చైల్డ్ ఐసోఫిక్స్ యాంకరేజ్ ఫీచర్లు ఉంటాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్, టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లూ జత చేశారు.