Nothing Phone 4b : నథింగ్ నుంచి వచ్చే ఫోన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. వీటి డిజైన్ ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే నథింగ్ నుంచి 4ఏ సహా వివిధ మోడల్ ఫోన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు వీటి తర్వాతి వెర్షన్‌గా 4బి పేరుతో కొత్త ఫోన్ విడుదల చేసింది నథింగ్. ఇది బి సిరీస్‌లో వస్తున్న తొలి నథింగ్ మొబైల్ ఫోన్. ఇందులోనే ఐపీఎల్ టీం అయిన ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం నథింగ్ 4బి ఆర్సీబీ ఎడిషన్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ మోడల్ మాత్రం ప్రస్తుతం బెంగళూరులోని నథింగ్ స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ వంటి ఇతర టీంల ఎడిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జూలై 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివిధ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఆర్సీబీ ఎడిషన్ మాత్రం జూలై 7 నుంచి బెంగళూరు స్టోర్లలో మాత్రమే ఉంటుంది. నథింగ్ 4బిలోని ఫీచర్లివే.
6.77 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 4 చిప్సెట్, గ్లైఫ్బార్ ఇంటర్ఫేస్, ఆండ్రాయిడ్ 16 విత్ నథింగ్ 4.1 ఓఎస్, ఏఐ పవర్డ్ ఫీచర్స్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్, 1,200 ఛార్జింగ్ సైకిల్స్ హెల్తీ, 27 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్, 80 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్, 50ఎంపీ సామ్సంగ్ మెయిన్ కెమెరా+8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ64 రేటింగ్, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వంటి ఫీచర్లున్నాయి. ధరలు రూ. 34,999/రూ.38,999. అయితే, వివిధ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో రూ.29,999/రూ. 33,699లకు పొందవచ్చు. బ్లాక్, వైట్, బ్లూ కలర్స్‌లో లభ్యం.