Nissan Magnite GEZA | నిసాన్ మ్యాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ ఆవిష్కరణ.. ధర రూ.10 లక్షల్లోపే.. ఇవీ స్పెషిపికేషన్స్..!
Nissan Magnite GEZA | ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్.. భారత్ మార్కెట్లో తన పాపులర్ ఎస్యూవీ మ్యాగ్నైట్ గెజా (Nissan Magnite GEZA) స్పెషల్ అప్డేటెడ్ వర్షన్ ఆవిష్కరించింది.
Nissan Magnite GEZA | ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్.. భారత్ మార్కెట్లో తన పాపులర్ ఎస్యూవీ మ్యాగ్నైట్ గెజా (Nissan Magnite GEZA) స్పెషల్ అప్డేటెడ్ వర్షన్ ఆవిష్కరించింది. మ్యాగ్నైట్ గెజా ఆవిష్కరించి ఏడాది పూర్తయిన సందర్భంగా అప్ డేటెడ్ వర్షన్ కారు తీసుకొచ్చింది. 2024 మ్యాగ్నైట్ గెజా ఎడిషన్ కారు ధర రూ.9.84 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఇంతకుముందు కురో ఆల్ బ్లాక్ ఎడిషన్ మ్యాగ్నైట్ గెజా సీవీటీ స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చింది. తాజాగా ఇదే సెగ్మెంట్ లో సీవీటీ టర్బో ఆప్షన్ లో వస్తున్న మ్యాగ్నైట్ గెజా కారు అత్యంత చౌకగా రూ.10 లక్షల్లోపు లభిస్తుందని నిసాన్ తెలిపింది.
2024 నిసాన్ మ్యాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ సంగీత ప్రియులకు వీనుల విందు చేసేలా మరింత ప్రీమియం ఇన్ఫోటైన్మెంట్ ప్యాకేజీ ఉంటుంది. ఇందులో 9-అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ప్రీమియం జేబీఎల్ స్పీకర్లు, ట్రాజెక్టరీ లైన్స్‌తోపాటు రేర్ వ్యూ కెమెరా, యాప్స్ సాయంతో నియంత్రించే అంబియెంట్ లైట్, న్యూ బైగ్ అప్హోల్స్టరీ, గెజా ఎడిషన్ బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇతర సీవీటీ వేరియంట్లలో కంటే అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇదని నిసాన్ తెలిపింది. నిసాన్ మ్యాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ కారు సీవీటీ ట్రాన్స్ మిషన్ యూనిట్ తోకూడిన 1.0 లీటర్ల టర్బో చార్జిడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 98 బీహెచ్పీ విద్యుత్, 160 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

