Crypto Tax | క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. క్రిప్టో కరెన్సీలను డిజిటల్ అసెట్స్‌గా పరిగణిస్తున్నట్లు 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలిపారు. మంగళవారం ఆమె లోక్‌సభలో వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. డిజిటల్ వర్చువల్ అసెట్స్ ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తామని తెలిపారు. అలాగే డిజిటల్ అసెట్స్ ద్వారా గిఫ్ట్‌లు పొందిన వారు పన్ను చెల్లించాల్సిందేనని తెలిపారు.