హైదరాబాద్, మే 12: హైజిన్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల తయారీ సంస్థ నైన్.. కంపెనీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఉద్యోగులను ప్రశంసించింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అమ్మకాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినవారిని సత్కరించింది. సంస్థ ఆదాయం పెరుగుదలలో ఉద్యోగుల శ్రమ ఎంతగానో ఉందని ఈ సందర్భంగా నైన్ వ్యవస్థాపకులు అమర్ తుల్సియాన్, గౌరవ్ బత్వాల్, శరత్ ఖేమ్కా కొనియాడారు. కరోనా సంక్షోభంలో యువతులు, మహిళలకు శానిటరీ ప్యాడ్స్‌ను ఉచితంగా అందించామని, ఇతర సామాజిక కార్యక్రమాల్లోనూ సంస్థ చురుగ్గా పాల్గొన్నదని వారు గుర్తుచేశారు.