Spam Calls | న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : వచ్చే ఏడాది జనవరికల్లా స్పామ్ కాల్స్, మెసేజ్‌ల అడ్డుకట్టకు సవరించిన కఠిన నిబంధనల్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటి తెలిపారు. ఇటీవలి తమ కన్సల్టేషన్ పేపర్‌పై జరిపిన విస్తృత చర్చల తర్వాత మొబైల్ వినియోగదారులను విసిగిస్తున్న స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు మరింత కఠిన నిబంధనల అమలు అవసరమని గుర్తించామన్నారు.
అలాగే ఇటీవల టెలికం శాఖ నుంచి వచ్చిన సిఫార్సు ఆధారంగా టెలీమార్కెటీర్ల కోసం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌పై మరో కన్సల్టేషన్ పేపర్‌ను సైతం సిద్ధం చేయబోతున్నామని ట్రాయ్ చీఫ్ తెలియజేశారు. స్పామ్ కాల్స్, మోసపూరిత మెసేజ్‌లకు చెక్ పెట్టేందుకు గత కొన్ని నెలలుగా ట్రాయ్ తీసుకుంటున్న చర్యలను తాజాగా పీటీఐకి లహోటి వివరించారు.