న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశీయ మార్కెట్లోకి సరికొత్త థార్ మాడల్‌ను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.16.99 లక్షలకు విక్రయించనున్నది.
ఐదేండ్ల క్రితం దేశీయ రోడ్లపై అడుగుపెట్టిన ఈ మాడల్.. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి కీలక మార్పులు చేసింది. 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌లో 10.25 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో రూపొందించింది.