న్యూఢిల్లీ : 2022 మహీంద్ర స్కార్పియో-ఎన్ జూన్ 27న మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. స్కార్పియో-ఎన్ ఫీచర్లను దశలవారీగా వెల్లడిస్తున్న మహీంద్ర తాజాగా ఎస్యూవీ ఇంటీరియర్ డిజైన్‌ను వెల్లడించింది. బ్రౌన్, బ్లాక్ కాంబినేషన్‌తో స్కార్పియో-ఎన్ న్యూ ఇంటీరియర్ డెకరేషన్తో ముందుకురానుంది.
మెటల్ ఫినిష్‌తో డ్యాష్‌బోర్డు ఆకట్టుకుంటుంది. ఆండ్రాయిడ్, యాపిల్ కనెక్టివిటీతో కూడిన భారీ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. న్యూ స్కార్పియో-ఎన్ సోనీ 3డీ సౌండ్ సిస్టంను కలిగిఉంది. క్లైమేట్ కంట్రోల్ సిస్టంతో పాటు స్కార్పియో-ఎన్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌తో కస్టమర్ల ముందుకు రానుంది.
ఇక వైర్లెస్ చార్జింగ్, ట్విన్ పాడ్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రూఫ్ మౌంటెడ్ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి. పూర్తిగా న్యూ డిజైన్‌తో రానున్న న్యూ స్కార్పియో ఎన్ మూడు వరసల సీటింగ్‌తో సిక్స్, సెవెన్ సీటర్ ఎస్‌యూవీగా కస్టమర్ల ముందుకొస్తోంది.