Gold Loan | అత్యవసర సమయాల్లో అందరికీ గుర్తొచ్చేవి గోల్డ్ లోన్సే. వైద్యం, విద్య, వ్యాపారం, వ్యవసాయం ఇలా చెప్పుకుంటూపోతే మన ప్రతీ నగదు అవసరాలు వేగంగా తీరే మార్గం ఒక్క బంగారం తనఖా రుణాల ద్వారానే ఉంటుందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. పైగా పసిడి తాకట్టుపై ఇచ్చే ఈ రుణాలు సెక్యూర్డ్ లోన్స్. కాబట్టి రుణదాత (బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు)లూ వీటికి అమితాసక్తినే కనబరుస్తూంటారు. అయితే ఈ బిజినెస్లో అవకతవకలకు వీలుందన్నదానిపై దృష్టిపెట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇటీవల నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల్ని గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.