New KTM Bikes | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కేటీఎం (KTM).. భారత్ మార్కెట్లోకి రెండు మోటారు సైకిళ్లు తీసుకొచ్చింది. 250 డ్యూక్ (250 Duke), 390 డ్యూక్ (350 Duke) అనే పేర్లతో ఆవిష్కరించింది. ఈ రెండు మోటారు సైకిళ్లు నూతన ఫ్రేమ్‌తో రూపుదిద్దుకున్నాయి. యాంట్రీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి సేఫ్టీ ఫీచర్లు జత చేశారు. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 మోటారు సైకిల్‌తో కేటీఎం 250 డ్యూక్ (KTM 250 Duke), కేటీఎం 390 డ్యూక్ (KTM 390 Duke) మోటారు సైకిళ్లు పోటీ పడతాయి.
కేటీఎం 250 డ్యూక్ (KTM 250 Duke) బైక్ రూ.2.39 లక్షలు (ఎక్స్ షోరూమ్), కేటీఎం 390 డ్యూక్ (KTM 390 Duke) రూ.3.11 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కేటీఎం 250 డ్యూక్ మోడల్ మోటారు సైకిల్ తో పోలిస్తే న్యూ మోడల్ రూ.779 ఎక్కువ. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కేటీఎం 390 డ్యూక్ మోటారు సైకిల్ తో పోలిస్తే న్యూ జనరేషన్ కేటీఎం 390 డ్యూక్ బైక్ ధర రూ.13 వేల కంటే ఎక్కువ. రెండు మోటారు సైకిళ్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కొనుగోలుదారులు రూ.4,499 చెల్లించి బైక్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెలాఖరులోగా డీలర్ల వద్దకు మోటారు సైకిళ్లు చేరతాయి.
న్యూ ప్లాట్ ఫామ్‌పై కేటీఎం 250 డ్యూక్ (KTM 250 Duke), కేటీఎం 390 డ్యూక్ (KTM 390 Duke) డిజైన్ చేశారు. ట్రెల్లీస్ ఫ్రేమ్, అల్యూమినియం సబ్-ఫ్రేమ్ తో రూపుదిద్దుకున్నాయి. పవర్ టూ వెయిట్ నిష్పత్తి ప్రాతిపదికన ఇంజిన్ హై స్పీడ్ అందుకుంటుంది. కొత్త ప్లాట్‌ఫామ్‌పై రైడింగ్ బైక్స్ హ్యాండ్లింగ్ మెరుగు పరిచామని కేటీఎం తెలిపింది. ఇంతకుముందు బైక్‌లతో పోలిస్తే అత్యంత ఆకర్షణీయంగా, దూకుడుగా కనిపిస్తాయి. ఫ్రంట్‌లో న్యూ ట్విన్ హెడ్ ల్యాంప్ సెటప్, హెడ్ ల్యాంప్ హౌసింగ్‌కు పక్కన ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఏర్పాటు చేశారు.
న్యూ కేటీఎం 390 బైక్ (KTM 390 Duke) రెండు కలర్ ఆప్షన్లు – ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మెటాలిక్ (Electronic Orange Metallic), అట్లాంటిక్ బ్లూ (Atlantic Blue) రంగుల్లో లభిస్తే, కేటీఎం 250 డ్యూక్ బైక్ (KTM 250 Duke) కూడా రెండు రంగుల ఆప్షన్లు – ఎలక్ట్రానిక్ ఆరెంజ్ (Electronic Orange), సిరామిక్ వైట్ (Ceramic White) కలర్స్‌లో లభిస్తాయి. రెండు మోటారు సైకిళ్లు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటాయి.
న్యూ కేటీఎం 390 డ్యూక్ (New KTM 390 Duke) బైక్ 389 సీసీ లిక్విడ్- కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 45.3 హెచ్‌పీ విద్యుత్, 39 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. న్యూ కేటీఎం 250 డ్యూక్ బైక్ (New KTM 250 Duke) 249సీసీ లిక్విడ్ – కూల్డ్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 31 హెచ్‌పీ విద్యుత్ 25 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. గత మోడల్ మోటారు సైకిళ్ల కంటే ఒక హెచ్‌పీ విద్యుత్, ఒక ఎన్ఎం టార్చి ఎక్కువగా విడుదల చేస్తాయి. రెండు మోటారు సైకిళ్లు 6-స్పీడ్ గేర్ బాక్స్ విత్ క్విక్ షిఫ్టర్ అండ్ స్లిప్పర్ క్లచ్ కలిగి ఉంటాయి.
రెండు మోటారు సైకిళ్లలోనూ రైడింగ్ కంఫర్టబుల్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. డబ్ల్యూపీ అపెక్స్ అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోర్క్ విత్ 5-క్లిక్ రీబౌండ్, కంప్రెషన్ అడ్జస్ట్ మెంట్, 5-క్లిక్ రీబౌండ్ అండ్ 10-క్లిక్ ప్రీ లోడ్ అడ్జస్టబుల్ మోనోసాక్ ఎట్ రేర్ ఉంటాయి. రెండు మోటారు సైకిళ్లలో అడ్వాన్స్డ్ ఏబీఎస్‌తోపాటు హైటెక్ ‘బీవైబీఆర్ఈ’ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, సూపర్ మోటో ఏబీఎస్, ట్రాక్ స్క్రీన్, లాంచ్ కంట్రోల్, 5- అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే విత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టైప్-సీ చార్జింగ్ పోర్ట్ తదితర ఫీచర్లు ఉంటాయి.