WhatsApp | ఇన్స్టంట్ మెస్సేజింగ్ ఫ్లాట్‌పామ్ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీగా యూజర్లు ఉన్నారు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ మోటా కంపెనీ పరిచయం చేస్తుంటుంది. ప్రస్తుతం పలువురు వాట్సాప్ స్టేటస్‌ని అప్డేట్ చేసుకోవడంలో కొంత ఇబ్బందులకు గురవుతున్న వారికి శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కంపెనీ కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నది. వాట్సాప్ వెబ్ వర్షన్ నుంచి సైతం వాట్సాప్ స్టేటస్‌ను అప్డేట్ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్లో ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ఉన్నది. ప్రస్తుతం కేవలం మొబైల్లోనే స్టేటస్‌ను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫీచర్ వాట్సాప్ కంపానియన్ మోడ్‌లో ఓ భాగం.
ఇందులో యూజర్లు నాలుగు వేర్వేరు డివైజెస్‌లో ఒకే అకౌంట్‌ను లాగిన్ చేసుకునే వీలుంటుంది. స్టేటస్‌లో వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్‌లకు ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్‌ను షేర్ చేసే అవకాశం వాట్సాప్ కల్పిస్తున్నది. ఫీచర్ సహాయంతో వెబ్ వెర్షన్ లేదంటే.. లింక్ చేయబడిన కంపానియన్ నుంచి స్టేటస్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.2353.59లో కనిపించింది. ఈ విషయాన్ని WABetaInfo తెలిపింది. అప్డేట్ అందరికీ అందుబాటులోకి వస్తే ల్యాప్‌టాప్, కంప్యూటర్ల నుంచి సైతం వాట్సాప్‌ను అప్డేట్ చేసుకునే అవకాశం కలుగనున్నది. స్టేటస్ అప్డేట్ చేసిన సమయంలో కంటెంట్ మొత్తం ఎండ్-టు-ఎండ్ ప్రొటెక్ట్ చేయబడుతుందని వాబీటాఇన్ఫో పేర్కొంది. ఫీచర్ మొదట ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానున్నది.