BMW X3 | ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా (BMW Group India) తాజాగా తన బీఎండబ్ల్యూ ఎక్స్3 (BMW X3) కారును భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (Bharat Mobility Global Expo)లో ప్రదర్శించింది. బీఎండబ్ల్యూ ఎక్స్3 తాజా స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ అప్డేటెడ్ వర్షన్ కారు ఇది. ఇది పెట్రోల్, డీజిల్ పవర్ ట్రైన్ ఆప్షన్లలో లభిస్తుంది. బీఎండబ్ల్యూ ఎక్స్ 3 (BMW X3) కారు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్3 (BMW X3) రెండు వేరియంట్లు – బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20 ఎం స్పోర్ట్ (BMW X3 xDrive20 M Sport) ధర రూ.75.80 లక్షలు (ఎక్స్ షోరూమ్), బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 20డీ ఎం స్పోర్ట్ (BMW X3 xDrive20d M Sport) ధర రూ.77.80 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతాయి. తాజాగా ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ ఎక్స్3 (BMW X3) ఫోర్త్ జనరేషన్ కారు లార్జర్, రీడిఫైన్ ప్రెజెన్స్, అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో అందుబాటులో ఉంటుంది.
బీఎండబ్ల్యూ ఎక్స్3 (BMW X3) కారు డ్యూన్ గ్రే మెటాలిక్ (Dune Grey Metallic), అల్పైన్ వైట్ (Alpine White), బ్రూక్లిన్ గ్రే మెటాలిక్ (Brooklyn Grey Metallic) పెయింట్ ఆప్షన్లతో వస్తుంది. పదేండ్లు లేదా 2,00,000 కిమీ సర్వీస్ ప్యాకేజీలతోపాటు ఎక్స్టెన్షన్ వారంటీ కూడా ఉంటుంది. ఈ కారు షార్ప్ కాంటౌర్స్, అప్రైట్ బీఎండబ్ల్యూ కిడ్నీ గ్రిల్లె కిగి ఉంటుంది. తొలిసారి గ్రిల్లె ఎలిమెంట్స్‌తోపాటు కాంటూర్ లైటింగ్‌తోపాటు బీఎండబ్ల్యూ ఐకానిక్ గ్లో ఉంటాయి. రీ డిజైన్డ్ ఎల్-షేప్డ్ ట్విన్ హెడ్ లైట్స్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, కంప్లీట్ విత్ కార్నరింగ్ లైట్ ఫంక్షన్స్, బ్లూ డిజైన్, బెటర్ ఇల్యూమినేసన్ కోసం ప్రొజెక్టర్ బేస్డ్ అడాప్టివ్ ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్3 (BMW X3) కారు డ్రైవర్ ఫోకస్డ్ బీఎండబ్ల్యూ కర్వ్డ్ డిస్ప్లే, 12.3 అంగుళాల ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, 14.9 అంగుళాల కంట్రోల్ డిస్ప్లే, బీఎండబ్ల్యూ ఇంటరాక్షన్ బార్, ఎయిర్‌ఫ్లో, హజార్డ్ లైట్స్ కోసం ప్యానెల్స్, హ్యాప్టిక్ కంట్రోల్ బటన్స్, స్టాండర్డ్ షిఫ్ట్ పెడల్స్, సీట్స్ వెంటిలేషన్, లుంబార్ సపోర్ట్ బ్యాక్ రెస్ట్ విడ్త్ అడ్జస్ట్మెంట్, పనోరమిక్ సన్ రూఫ్, 15 స్పీకర్స్ అండ్ 750 వాట్స్తోపాటు హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. 2-లీటర్ల 4- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ (190 బీహెచ్పీ విద్యుత్, 310 ఎన్ఎం టార్క్)తో కేవలం 7.9 సెకన్లలో వంద కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 2- లీటర్ల 4- సిలిండర్ డీజిల్ ఇంజిన్ (197 బీహెచ్పీ విద్యుత్, 400 ఎన్ఎం టార్క్) కేవలం 7.7 సెకన్లలో వంద కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. రెండు ఇంజిన్లు 48వీ మైల్డ్ హైబ్రీడ్ సిస్టమ్,డ్రైవింగ్ మోడ్‌ను బట్టి సౌకర్యవంతంగా డైనమిక్ హ్యాండ్లింగ్ చేసేందుకు అడాప్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్3 (BMW X3) కారు యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తోపాటు డ్రైవింగ్ అసిస్టెంట్ ప్లస్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. బీఎండబ్ల్యూ కనెక్టెడ్ డ్రైవ్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ పార్కింగ్ అసిస్టెంట్ ఉంటాయి. ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్, అటెంటివ్ నెస్ అసిస్టెన్స్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ విత్ కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సీబీసీ), ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, స్లైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ విత్ క్రాష్ సెన్సర్, ప్రొటెక్షన్ పెంచే చైల్డ్ సీటింగ్ మౌంటింగ్ తదితర ఫీచర్లు ఉంటాయి.