న్యూయార్క్ : వృద్ధి మందగించి రాబడి పడిపోవడంతో 150 మంది ఉద్యోగులను తొలగించామని స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. వ్యాపార అవసరాల కోసమే ఈ మార్పులు చేపడుతున్నామని, ఉద్యోగుల సామర్ధ్యం కొలమానం కాదని గొప్ప ఉద్యోగులను వదులుకోవాలని తాము అనుకోవడం లేదని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.
కంపెనీ దాదాపు 150 మంది ఉద్యోగులపై వేటు వేయగా వీరిలో అత్యధికులు అమెరికన్ ఉద్యోగులే ఉన్నారని చెప్పారు. కాంట్రాక్టర్లపై వెచ్చించే మొత్తాల్లో కూడా నెట్‌ఫ్లిక్స్ కోత విధించిందని తెలిపారు. దశాబ్ధం తర్వాత నెట్‌ప్లిక్స్ సబ్స్క్రైబర్లు తగ్గిపోయారని కంపెనీ ప్రకటించిన కొద్దివారాల తర్వాతే ఉద్యోగులపై సంస్ధ వేటు వేయడం గమనార్హం. గత ఏడాది చివరి క్వార్టర్‌తో పోలిస్తే సబ్స్క్రైబర్ల సంఖ్య ఈ ఏడాది తొలి క్వార్టర్లో 22.1 కోట్లకు పడిపోయినట్టు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.