ఆర్థిక క్రమశిక్షణతోనే దేశాభివృద్ధి
దేశ ఆర్థిక వ్యవస్థ క్షేమంగా ఉండాలన్నా, వృద్ధిపథంలో దూసుకుపోవాలన్నా ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా నొక్కిచెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన రాష్ట్ర ఆర్థిక కార్యదర్శుల 35వ సమావేశానికి మల్హోత్రా హజరయ్యారు.
- రాష్ర్టాలు అడ్డగోలు ఖర్చులు చేయవద్దు
- ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
ముంబై, సెప్టెంబర్ 18 : దేశ ఆర్థిక వ్యవస్థ క్షేమంగా ఉండాలన్నా, వృద్ధిపథంలో దూసుకుపోవాలన్నా ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా నొక్కిచెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన రాష్ట్ర ఆర్థిక కార్యదర్శుల 35వ సమావేశానికి మల్హోత్రా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ర్టాలు అడ్డగోలు ఖర్చులు చేయవద్దని, అర్థవంతమైన వ్యయాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
అలాగే బడ్జెటేతర రుణాలపట్ల జాగ్రత్త వహించాలని కూడా చెప్పినట్టు ఓ ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. కరెన్సీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంశాల్లో ఆర్బీఐ, రాష్ర్టాల మధ్య ఆరోగ్యకరమైన సహకారం, సమన్వయం ఉండాలనీ మల్హోత్రా చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశంలోని 28 రాష్ర్టాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆర్థిక కార్యదర్శులు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు, కాగ్, సీజీఏ హాజరయ్యారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

