Moto G73 5G | లెనోవో సారధ్యంలోని కంపెనీ మోటరోలా.. భారత్ మార్కెట్లోకి మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ మోటో జీ73 ఆవిష్కరించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 930 చిప్సెట్ ప్రాసెసర్‌తో వస్తున్న ఫోన్ ఇది. ఆల్ట్రా పెర్ఫార్మెన్స్ కల ప్రాసెసర్. భారత్‌లోని 5జీ స్మార్ట్ ఫోన్లలోకెల్లా ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ఇదని లెనోవో చెబుతున్నది. వాటర్ రిసిస్టెంట్ డిజైన్‌తో వస్తున్న మోటో జీ73 5జీ ఫోన్.. రియల్మీ 10 ప్రో, షియోమీ రెడ్మీ నోట్ 12, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ వంటి ఫోన్లతో పోటీ పడుతుందని చెబుతున్నారు.
మోటో జీ73 5జీ ఫోన్ 8జీబీ రామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌తో వస్తున్నది. దీని ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. బ్యాంకు ఆఫర్‌తో ఈ ఫోన్‌ను రూ.16,999లకే కొనుగోలు చేయొచ్చు. ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 16 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇది లుసెంట్ వైట్, మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.