కోవిడ్ మృతుల కుటుంబాలకు ఈఎస్ఐ బెనిఫిట్లు ఇలా!
కోవిడ్ మృతుల కుటుంబాలకు ఈఎస్ఐ బెనిఫిట్లు ఇలా! | రోనా వేళ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మికశాఖ అదనపు బెనిఫిట్లు కల్పించింది. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ...

న్యూఢిల్లీ: కరోనా వేళ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మికశాఖ అదనపు బెనిఫిట్లు కల్పించింది. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ ద్వారా ఈ బెనిఫిట్లు అందుబాటులోకి తెచ్చింది. కరోనా మహమ్మారి వల్ల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా కార్మికుల కుటుంబ సభ్యుల సమస్యలను పరిష్కరించుకోవడానికి వెసులుబాటు తెచ్చింది.
యాజమాన్యాలపై ఎటువంటి అదనపు భారం మోపకుండానే కార్మికులకు సామాజిక భద్రత విస్తరించాలని భావిస్తున్నది. ప్రస్తుతం ఈఎస్ఐసీలో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులు మధ్యలో ఏదైనా ప్రమాదంలో మరణిస్తే, వికలాంగులైతే భార్య/ జీవిత భాగస్వామి/ వితంతు తల్లికి సగటున 90%వేతనం చెల్లిస్తారు.
భార్యకు, వితంతు తల్లికి జీవితాంతం, పిల్లలకు 25 ఏండ్ల వయస్సు వచ్చే వరకు ఈ వేతనం అందుతుంది. బాలికలకు 25 ఏండ్ల వయస్సు వచ్చే వరకు అంటే వివాహం అయ్యే వరకు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది.
కరోనా వల్ల మరణించిన ఈఎస్ఐసీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు కూడా.. (ప్రమాదంలో మరణించిన/ వికలాంగులైన వారికి మాదిరే) ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. అయితే, ఈఎస్ఐసీలో ఇన్సూర్ అయిన సభ్యులు తప్పనిసరిగా ఈ ప్రయోజనాల కోసం మూడు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అలాగే, ఈఎస్ఐసీ సభ్యులు మూడు నెలలు (78 రోజులు) వేతనాలు తీసుకోవడంతోపాటు ఈఎస్ఐలో తమ కంట్రిబ్యూషన్ చేయాలి. ఈ స్కీమ్ 2020 మార్చి 24 నుంచి రెండేండ్ల పాటు అమలులో ఉంటుంది.
ఈ స్కీం కింద కనీస సర్వీసుకు గ్రాట్యూటీ తీసుకోవాలన్న నిబంధన అమలులోకి రాదు. అనారోగ్యంతో బాధపడుతూ ఒక ఏడాదిలో 91 రోజులు విధులకు హాజరు కాకుంటే 70% వేతనం చెల్లిస్తారు.

కరోనా కింద మరణించిన కార్మికుల కుటుంబాలకు 90 శాతం వేతనం చెల్లించడానికి నిబంధనలు ఇవే:
మరణించిన ఒక కార్మికుడి కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా రూ.6-7 లక్షల వరకు పెంచొచ్చు. కనీస బెనిఫిట్ రూ.2.5 లక్షల వరకు హామీ ఇస్తున్నది.
మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు కనీసం రూ.2.5 లక్షల పరిహారం చెల్లించాలన్న నిబంధనను పునరుద్ధరించారు. గతేడాది ఫిబ్రవరి 15 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది.
2021-22 నుంచి 2023-24 వరకు వచ్చే మూడేండ్లలో అర్హులైన కుటుంబ సభ్యులకు ఈడీఎల్ఐ నిధి కింద రూ.2,185 కోట్లు అదనపు ఖర్చవుతుందని కార్మికశాఖ అంచనా వేసింది.
ఈ స్కీం కింద ఏడాదిలో సుమారు 50 వేల కార్మికుల కుటుంబాలు క్లెయిమ్‌లు చేస్తాయని అంచనా. కరోనాతో కార్మికులు మరణిస్తే సుమారు 10 వేల కార్మికుల కుటుంబాలు అదనంగా ఈ స్కీమ్ కోసం క్లెయిమ్ చేయొచ్చునని అంచనా.
ఇవి కూడా చదవండి:
అక్కెరకురాని ముచ్చట్లతో లాభం లేదు.. ప్రధాని మన్ కీ బాత్‌పై రాహుల్‌గాంధీ ఫైర్
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
ఈఎస్ఐసీ ద్వారా ఫ్యామిలీ పెన్షన్…
IPL 2021: ఐపీఎల్ కోసం సీపీఎల్ షెడ్యూల్ మార్పు
మార్స్‌పై మేఘాలను చూశారా.. క్యూరియాసిటీ పంపిన అద్భుతమైన ఫొటోలు
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
మళ్లీ రాజకీయాల్లోకి వస్తా.. పార్టీని గాడిలో పెడతా!
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
పీపీఈ కిట్ వేసుకొని.. కొవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నదిలో పడేస్తూ.. షాకింగ్ వీడియో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

