మినీ లాక్డౌన్లతో మైక్రోఫైనాన్స్ సంస్థలు కుదేలే!
మైక్రోఫైనాన్స్ సంస్థలు కుదేలే| మహారాష్ట్రలో మాదిరిగా మరిన్ని రాష్ట్రాలు మినీ లాక్డౌన్లు విధిస్తే మైక్రో ఫైనాన్స్ సంస్థలు దెబ్బ తింటాయని క్రిసిల్ రేటింగ్స్ ఆందోళన

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మాదిరిగా మరిన్ని రాష్ట్రాలు మినీ లాక్డౌన్లు విధిస్తే మైక్రో ఫైనాన్స్ సంస్థలు దెబ్బ తింటాయని క్రిసిల్ రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి మినీ లాక్డౌన్లు, రాత్రి వేళ కర్ఫ్యూలు, ఆంక్షలు కొనసాగిస్తే.. సంబంధిత మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని క్రిసిల్ పేర్కొంది.
మహారాష్ట్రలో కరోనా రెండో వేవ్‌లో అత్యధిక కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు మినీ లాక్డౌన్ ప్రకటించింది. కొన్ని ఇతర రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారాంత లాక్డౌన్ ప్రకటించాయి.
మైక్రో ఫైనాన్స్ రుణాల మంజూరులో టాప్-5 రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటిగా ఉంది. గతేడాది డిసెంబర్ నాటికి రూ.16,700 రుణాలివ్వగా, వాటిలో ఏడు శాతం మైక్రో ఫైనాన్స్ సంస్థల వాటా ఉంది. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐస్) వాటా 40 శాతం (రూ.6,700 కోట్లు) ఉన్నాయి.
తాజా మినీ లాక్డౌన్లు, ఆంక్షలు విధించడానికి ముందు మహారాష్ట్రలో రుణాల వసూళ్లు 85-90 శాతం ఉండేవి. జాతీయ స్థాయిలో సగటు రుణాల వసూళ్లు 90-94 శాతంగా ఉంది.
కరోనాకు ముందు రుణాల వసూళ్లు 98-99 శాతంగా ఉంటే, తాజాగా గత కొన్ని నెలలుగా అది 90-94 శాతానికి పడిపోయిందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ ఓసియర్ క్రుష్ణన్ సీతారామన్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మళ్లీ కొండెక్కుతున్న పసిడి ధరలు
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్‌పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
రఫేల్ డీల్‌తో దేశానికి రూ 21,000 కోట్ల నష్టం : కాంగ్రెస్
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు పొందడమెలా
తక్కువ సిబిల్ స్కోర్‌తోనూ పర్సనల్ లోన్.. అయితే!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- corona
- crisil
- micro finance
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

