హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ డార్విన్ బాక్స్‌లో గ్లోబల్ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మానవ వనరుల విభాగంలో సాఫ్ట్వేర్ కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా డార్విన్ బాక్స్ సేవలు అందిస్తోంది. అయితే గత ఏడాదే యునికార్న్ కంపెనీ (బిలియన్ డాలర్లకుపైగానే విలువ)గా గుర్తింపు పొం దిన ఈ సంస్థకు.. తాజాగా మైక్రోసాఫ్ట్ దన్ను లభించింది. దీంతో ఈ సంస్థకు మరింత ప్రాచుర్యం లభించినైట్టెంది. 2015లో హైదరాబాద్ కేంద్రంగా స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన డార్విన్ బాక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 700 వ్యాపార సంస్థలు క్ల యింట్లుగా ఉన్నాయి. కాగా, డార్విన్ బాక్స్‌లో ఏ మేరకు పెట్టుబడులు పెట్టామన్న వివరాలను మాత్రం మైక్రోసాఫ్ట్ తెలియజేయలేదు.