భారత్‌కు ఏఐలో శిక్షణ
నానాటికి కృత్రిమ మేధస్సు వినియోగం, అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దానిపై దేశీయ యువతకు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది.
- 2025కల్లా 20 లక్షల మందికి నైపుణ్యం
- మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల
ముంబై, ఫిబ్రవరి 7: నానాటికి కృత్రిమ మేధస్సు వినియోగం, అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దానిపై దేశీయ యువతకు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే 2025కల్లా 20 లక్షల మంది భారతీయులకు ఏఐపై నైపుణ్యం పెరిగేలా ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టు మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో, భారత సంతతికి చెందిన సత్యా నాదెళ్ల చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన భారత్‌కు వచ్చారు. బుధవారం ఇక్కడ మాట్లాడుతూ.. ఈ కొత్త తరం టెక్నాలజీ అందరికీ సమానమైన వృద్ధిని అందివ్వగలదని అభిప్రాయపడ్డారు. 2025 నాటికి దేశంలో ఏఐ జీడీపీ 500 బిలియన్ డాలర్లను చేరగలదని అంచనా వేశారు. అలాగే ఓవరాల్ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందన్న ఆశాభావాన్ని కనబర్చారు.
ఏఐ రెగ్యులేషన్‌కు ఒక్కటై కదలాలి
కృత్రిమ మేధస్సు నియంత్రణకు సంబంధించి నియమ, నిబంధనల్ని సిద్ధం చేయడానికి భారత్, అమెరికా సహకారం తప్పనిసరి అని, అందుకు ఇరు దేశాలు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సత్యా నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఇక అంతకుముందు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను నాదెళ్ల కలిశారు. ఎయిర్ ఇండియాలో ఏఐ వినియోగంపై స్పందించారు. ఐటీసీ, అర్వింద్ సంస్థలతోపాటు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా ఏఐ టూల్స్‌ను వాడుతున్నట్టు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కాగా, ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారాతోనూ ఆయన ఈ టూర్ లో భాగంగా భేటీ కావాల్సి ఉన్నది. తెలుగువారైన సత్యా నాదెళ్ల పదేండ్ల క్రితం 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎన్నికైన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

