న్యూఢిల్లీ, డిసెంబర్ 4:ఎంజీ మోటర్ ఇండియా కూడా వాహన ధరల పెంపు జాబితాలోకి చేరింది. వచ్చే ఏడాది నుంచి అన్ని రకాల వాహన ధరలను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు కమోడిటీ ఉత్పత్తుల ధరలు అధికమవడం వల్లనే వాహన ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వాహన ధరలను ఎంతమేర పెంచుతున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడీ ఇండియా, టాటా మోటర్స్, మెర్సిడెజ్ బెంజ్లు తమ వాహన ధరలను పెంచుతున్నట్టు ఇదివరకే ప్రకటించాయి.