WhatsApp | ప్రముఖ ఇన్ స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తెస్తున్నది. తాజాగా భద్రతాపరమైన ఫీచర్లపైన ఫోకస్ చేస్తోంది. గుర్తు తెలియని ఆగంతకుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ రింగ్ కాకుండా సైలెన్స్ చేసుకునే సదుపాయాన్ని ఇటీవలే తీసుకొచ్చింది. తాజాగా ఐపీ అడ్రస్, లొకేసన్ ప్రొటెక్షన్ ఫెసిలిటీ తెచ్చింది. ఆడియో కాల్ చేసినా, వీడియో కాల్ చేసినా లొకేషన్, ఐపీ అడ్రస్ తదితర వివరాలు అవతలి వ్యక్తులకు తెలియనివ్వకుండా చూసుకోవచ్చు.
ఇప్పటికే ఈ ఫీచర్ కొంత మందికి అందుబాటులోకి వచ్చింది. మరికొందరికి అందుబాటులోకి రావాలి. ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. కుడివైపునా త్రీ డాట్స్ మెనూలోని ప్రైవసీలోకి వెళ్లాలి. అక్కడ కనిపించే అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. దీనివల్ల కాల్ క్వాలిటీ కొంత తగ్గుతుందని వాట్సాప్ పేర్కొంది.
కమ్యూనికేషన్ కు ఈ ఫీచర్ అదనపు సెక్యూరిటీ కల్పిస్తుందని వాట్సాప్ వాబీటా ఇన్ ఫో తెలిపింది. గుర్తు తెలియని ఆగంతకులతో మాట్లాడుతున్నప్పుడు మన ఐపీ అడ్రస్, లొకేషన్ వివరాలు తెలీకుండా ఈ ఫీచర్ అడ్డుకుంటుందని వెల్లడించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ తీసుకొచ్చింది వాట్సాప్. మీకూ ఈ ఫీచర్ వచ్చిందేమో చెక్ చేసుకుని.. రాకపోతే లేటెస్ట్ వాట్సాప్ వర్షన్ ఇన్ స్టాల్ చేసుకుని.. అటుపై చెక్ చేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.