Mercedes-Benz EQB 350 4Matic | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్-బెంజ్’ .. భారత్ మార్కెట్లోకి అప్‌గ్రేడెడ్ వర్షన్ ఈక్యూబీ 350 4మ్యాటిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు (EQB 350 4Matic Electric SUV) ఆవిష్కరించింది. దీని ధర రూ.77.50 లక్షలుగా నిర్ణయించింది. గత డిసెంబర్లో మార్కెట్లో ఆవిష్కరించిన పాత మోడల్ కారు ధర రూ.74.50 లక్షలు. అప్ గ్రేడెడ్ కారు ధర మరో రూ.3 లక్షలు అదనం.
అప్ గ్రేడెడ్ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ ఈవీ 350 (Mercedes-Benz EQB 350 4MATIC) కారు 66.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 423 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. 100 కిలోవాట్ల ఫాస్ట్ డీసీ చార్జర్ సాయంతో కేవలం 32 నిమిషాల్లో 80 శాతం చార్జ్ చేయొచ్చు. 11కిలోవాట్ల బాక్స్ చార్జర్‌తో కారు బ్యాటరీ ఫుల్ చార్జింగ్ కోసం 6.25 గంటల సమయం పడుతుంది.
పాత మోడల్ ఈక్యూబీ ఈవీ 350 కారు (Mercedes-Benz EQB 350 4MATIC) తో పోలిస్తే అప్ డేటెడ్ వేరియంట్ పనితీరు మెరుగు పరిచారు. ఈ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. ఇవి 225 బీహెచ్పీ పవర్ కంటే అధికంగా 288 బీహెచ్పీ విద్యుత్, 390 ఎన్ఎం కంటే 520 ఎన్ఎం టార్చి వెలువరిస్తాయి. కేవలం 6.2 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ అందుకుంటాయి. గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించగల కెపాసిటీ కలిగి ఉంది.
మెర్సిడెజ్ -బెంజ్ ఈక్యూబీ 350 4మ్యాటిక్ (Mercedes-Benz EQB 350 4MATIC) అప్డేటెడ్ కారు 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్‌లో బ్లాక్ ప్యానెల్ గ్రిల్స్, ఇరువైపులా ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్ విత్ ఎల్ఈడీ స్ట్రిప్, రూఫ్ రైల్స్, బ్యాక్ లిట్ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి.
మెర్సిడెజ్ -బెంజ్ ఈక్యూబీ 350 4మ్యాటిక్ (Mercedes-Benz EQB 350 4MATIC) ఇంటీరియర్‌గా డాష్ బోర్డ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం రెండు 10.25 అంగుళాల డిస్ ప్లేలు ఉన్నాయి. రోజ్ గోల్డ్ అసెంట్స్, టూ టోన్ సీట్స్, రేర్ వ్యూ, మోటరైజ్డ్ టాయిల్ గేట్ వంటి లగ్జరీ టచెస్ క్యాబిన్ లభ్యం అవుతుంది. పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, వైర్ లెస్ చార్జింగ్ పాడ్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.