Maruti e-Vitara | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఈ-విటారా (e-Vitara) కారును భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. గుజరాత్‌లోని మారుతి సుజుకి ప్లాంట్‌లో త్వరలో ఈ-విటారా (e-Vitara)కార్ల ఉత్పత్తి ప్రారంభం కానున్నది. జపాన్, యూరప్‌లతోపాటు 100కి పైగా దేశాలకు ఈ-విటారా కారును ఎగుమతి చేస్తామని మారుతి సుజుకి వెల్లడించింది. వచ్చే పదేండ్లలో తాము తయారుచేసే ఈవీ కార్ల వ్యూహంలో భాగం అని, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌క్లూజివ్‌గా ఈ-విటారా కారును ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించింది. టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జడ్ఎస్ ఈవీ, హ్యుండాయ్ క్రెటా ఈవీ, మహీంద్రా బీఈ-06 కార్లకు మారుతి సుజుకి ఈ-విటారా గట్టి పోటీ ఇవ్వనున్నది.
ఈవీఎక్స్ కాన్సెప్ట్ మాదిరిగానే మారుతి సుజుకి ఈ-విటారా కనిపిస్తుంది. ఫ్రంట్‌లో ట్రై-ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్ విత్ క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్లె, బ్రెజాలో మాదిరిగా లోయర్ బంపర్స్, స్కిడ్ ప్లేట్లతో స్మాల్ ఫాగ్ ల్యాంప్, ఫ్రంట్ ఫ్లాంక్స్పై చార్జింగ్ పోర్ట్, 18-అంగుళాల ఎయిరోడైనమికల్లీ డిజైన్డ్ అల్లాయ్ వీల్స్, సీ-పిల్లర్‌పై రేర్ డోర్ హ్యాండిల్ ఫీచర్లు ఉన్నాయి. రేర్‌లో ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్తోపాటు కనెక్టింగ్ లైట్స్, హై మౌంటెడ్ స్టాప్ లాంప్, స్కిడ్ ప్లేట్, బంపర్ దిగువన స్మాల్ స్క్వారిష్ ఫాగ్ లాంప్, సెంటర్లో ఈ-విటారా పేరు ఉంటాయి.
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్లతో ఫ్లోటింగ్ డ్యుయల్ స్క్రీన్లు, ఈబ్రేక్, డ్రైవ్ మోడ్ సెలెక్షన్, వైర్ లెస్ చార్జింగ్ పాడ్, గేర్ సెలెక్షన్ కంట్రోల్ కోసం గ్లోస్ బ్లాక్‌లో సెంటర్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, రెక్టాంగ్యులర్ ఏసీ వెంట్స్ విత్ దైర్ బ్రష్డ్ సిల్వర్ సరౌండ్స్, రోటరీ డ్రైవ్ స్టేట్ సెలెక్టర్, లెవల్-2 అడాస్ సిస్టమ్, సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.
ఈవీ కార్ల కోసం మారుతి సుజుకి డిజైన్ చేసిన ఆల్-న్యూ హియర్టెక్ ప్లాట్‌ఫామ్‌పై ఈ-విటారా కారు డిజైన్ చేశారు. ఇంటిగ్రేటెడ్ మోటార్, ఇన్వర్టర్ సింగిల్ యూనిట్‌గా రూపొందించారు. 49కిలోవాట్లు – 61 కిలోవాట్ల బ్యాటరీ ఆప్షన్లతో ఈ-విటారా పని చేస్తుంది. లిథియం ఐరన్ ఫాస్పేట్ (ఎల్ఎఫ్పీ) బ్లేడ్ సెల్స్‌తో తయారైన బ్యాటరీలు ఇందులో ఇచ్చారు. BYD కార్లలో ఇదే బ్యాటరీని వాడుతున్నారు. 61 కిలోవాట్ల బ్యాటరీతో సింగిల్ చార్జింగ్ చేస్తే ఈ 500 కిమీ వరకూ ప్రయాణిస్తుంది. దీనికోసం 174 HP మోటార్‌ను ఇచ్చారు.
49 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో 144HP మోటారు ఇస్తున్నారు. రెండు పాక్‌లలో మొటార్ 189 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. డ్యుయల్ మోటార్ సెటప్‌తో ఏడబ్ల్యూడీ వర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఏడబ్ల్యూడీ వర్షన్ కారులో 184 HP మోటార్ వాడారు. ఇది 300 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
ధర ఎంతో తెలుసా?..
e Vitara ధరను సుజుకి కంపెనీ అఫీషియల్‌గా ఇంకా చెప్పలేదు. మార్కెట్లో సమాచారం ప్రకారం దీని ధర 20-25 లక్షల రూపాయలు ఉండే అవకాశముంది.