మారుతి కార్లు మరింత ప్రియం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: మారుతి సుజుకీ.. తన వాహన ధరలను రెండు శాతం వరకు పెంచింది. సెలేరియో మోడల్ తప్పా ఇతర అన్ని మోడళ్ళ ధరలను 1.9 శాతం వరకు పెంచినట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరుగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుత సంవత్సరంలో మారుతి ధరలు పెంచడం ఇది మూడోసారి. ఇప్పటికే జనవరి, ఏప్రిల్‌తోపాటు సెప్టెంబర్ నెలలో కలుపుకొని మొత్తంగా 3.5 శాతం వరకు పెంచినట్లు అయింది. ప్రస్తుతం సంస్థ రూ.2.99 లక్షలు మొదలుకొని రూ.12.39 లక్షల లోపు పలు మోడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ..కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడంతో వాహన ధరలు పెంచకతప్పలేదని చెప్పారు. గతేడాది కిలో స్టీల్ ధర రూ.38 ఉండగా, ప్రస్తుతం రూ.65కి చేరుకున్నదని, అలాగే రాగి టన్ను ధర 5,200 డాలర్ల నుంచి 10 వేల డాలర్లకు చేరుకున్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

