Maruti Baleno | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరో కీలక మైలురాయిని అధిగమించింది. మారుతి సుజుకి ఆరేండ్ల క్రితం 2015 అక్టోబర్‌లో విపణిలో ఆవిష్కరించిన హ్యాచ్‌బ్యాక్ మోడల్ బాలెనో పది లక్షల కార్లు విక్రయించిన రికార్డును అధిగమించింది. మార్కెట్లో ఆవిష్కరించిన ఏడాదిలోపే లక్ష కార్లను విక్రయించింది.
2018 నవంబర్‌లో తొలి ఐదు లక్షల కార్లు సేల్ అయ్యాయి. ఈ ఏడాది మార్చిలో తొమ్మిది లక్షల కార్లు అమ్ముడయ్యాయి. కేవలం మరో తొమ్మిది నెలల్లోనే ఇంకొక లక్ష యూనిట్లను విక్రయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 248 నగరాల్లో 344 ఔట్లెట్లలో మారుతి బాలెనో కారు విక్రయిస్తున్నారు.
బాలెనో మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ క్యాటగిరీలో లీడర్‌గా నిలిచిందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో 25 శాతం వాటా కలిగి ఉందన్నారు. పట్టణ యువతరం అభిరుచులు, ఆకాంక్షలకు సరైన ఆప్షన్‌గా బాలెనో ఉందని చెప్పారు.
అంతే కాదు.. బాలెనో ద్వారా తన కస్టమర్లకు మారుతి సుజుకి హైబ్రీడ్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది. బాలెనో మోడల్ కారు మార్కెట్లో హ్యుండాయ్ ఐ20, టయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్, హోండా జాజ్ మోడల్ కార్లతో పోటీ పడుతున్నది.