HomeBusinessMany People Are Losing Money Due To Cyber Fraud
సైబర్ మోసాలతో భద్రం
ఇటీవలికాలంలో సైబర్ మోసాలబారినపడి ఎందరో నష్టపోతున్నారు. చదువురాని అమాయకుల సంగతి అటుంచితే.. ఉన్నత విద్యనభ్యసించినవారూ సైబర్ నేరగాళ్ల వలలో పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
ఇటీవలికాలంలో సైబర్ మోసాలబారినపడి ఎందరో నష్టపోతున్నారు. చదువురాని అమాయకుల సంగతి అటుంచితే.. ఉన్నత విద్యనభ్యసించినవారూ సైబర్ నేరగాళ్ల వలలో పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మరి నిపుణులు సూచిస్తున్న జాగ్రత్త లేంటో తెలుసా?
మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులకు చెప్పాల్సి వస్తే.. సదరు లావాదేవీ పూర్తయిన వెంటనే కొత్త పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలి.
అత్యంత క్లిష్టతరంగా, ఎవరి ఊహలకు అందనివిధంగా ఈ పాస్‌వర్డ్‌ల నిర్మాణం ఉంటే మంచిది. డిక్షనరీ వర్డ్స్‌ను వాడటం వల్ల పాస్‌వర్డ్‌లను సైబర్ మోసగాళ్లు ఊహించే వీలున్నది.
మాతృ భాషకు చెందిన అక్షరాలు లేదా మీకు మాత్రమే తెలిసిన తేదీలు, రకరకాల చిహ్నాలను పెట్టుకోవాలి. అప్పుడే డీ కోడింగ్‌కు కష్టమవుతుంది.
ప్రతీ 3 లేదా 6 నెలలకోసారి పాస్‌వర్డ్‌లను మారిస్తే ఉత్తమం. సుదీర్ఘకాలంపాటు ఒకే పాస్‌వర్డ్‌ను వాడటం వల్ల సైబర్ మోసగాళ్లబారినపడే ప్రమాదం పొంచి ఉంటుంది.
కనీసం 16 అక్షరాలతో పాస్వర్డ్ ఉండాలి. పాస్వర్డ్ ఎంత పెద్దదైతే దాన్ని కనిపెట్టడం మోసగాళ్లకు అంత కష్టమవుతుంది.
ఉచిత వైఫైలను వాడరాదు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, హోటళ్లలో ఫ్రీగా వస్తుందని ఉపయోగిస్తే మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇతరులకు తెలిసే వీలున్నది. అలాగే ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలను అస్సలు జరుపవద్దు. దీనివల్ల మన పిన్ నెంబర్లను హ్యాకర్స్ సులభంగా పసిగట్టగలరు.
పాస్‌వర్డ్‌లను మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకోవద్దు. ఫోన్ హ్యాక్ అయినప్పుడు అందులోని విలువైన డాటా కూడా దొంగతనానికి గురవుతుంది.