Mahindra XUV700 | మహీంద్రా ఎక్స్‌యూవీ 700 లాండ్ మార్క్ రికార్డు.. 33 నెలల్లో రెండు లక్షలు దాటిన సేల్స్..!
Mahindra XUV700 | మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కారు ఎక్స్‌యూవీ 700.. ఆవిష్కరించిన 33 నెలల్లో రెండు లక్షల యూనిట్లకు పైగా కార్లు విక్రయించింది.
Mahindra XUV700 | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మరో మైలురాయిని దాటింది. మహీంద్రా అండ్ మహీంద్రాలో టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కారు ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) మార్కెట్లోకి వచ్చిన 33 నెలల్లోనే రెండు లక్షలకు పైగా యూనిట్ల విక్రయంతో లాండ్ మార్క్ రికార్డు నమోదు చేసింది. డీప్ ఫారెస్ట్ (Deep Forest), బర్న్ట్ సైనా (Burnt Sienna) కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
మోనోకోక్యూ (monocoque) ప్లాట్ ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఎక్స్‌యూవీ 500 కొనసాగింపుగా మార్కెట్లోకి వచ్చిందే మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారు. ఫైవ్ స్టార్ గ్లోబల్ ఎన్-క్యాప్ సేఫ్టీ రేటింగ్‌తో భారత్ లోనే సేఫ్టీ కార్లలో ఎక్స్‌యూవీ 700 ఒకటిగా నిలిచింది. స్పో్ర్టీ డిజైన్, స్పేసియస్, ప్రీమియం క్యాబిన్ తోపాటు పవర్ ఫుల్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో అందుబాటులో ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) కారు ఆవిష్కరించిన 21 నెలల్లోనే తొలి లక్ష యూనిట్లు విక్రయించింది. అటుపై కేవలం ఏడాది కాలంలోనే మరో లక్ష కార్లను విక్రయించింది మహీంద్రా. కరోనా మహమ్మారి వేళ మార్కెట్లో ఆవిష్కరించిన ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) కారు అంచనాలను మించి కస్టమర్లకు చేరువవుతోంది. ఎస్యూవీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా కార్ల ఉత్పత్తిని స్థిరీకరించింది మహీంద్రా. తద్వారా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) వంటి ఎస్ యూవీ కార్ల కోసం వెయింటింగ్ పీరియడ్ తగ్గించేందుకు కృషి చేస్తోంది.

గత నెలలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) సుమారు 16 యూనిట్ల కార్లు బుకింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. గత ఫిబ్రవరిలో 35 వేలకు పైగా బుకింగ్స్ పెండింగ్ లో ఉన్నా, క్రమంగా ఉత్పత్తి పెంపుతో డెలివరీ వేగవంతమైంది. దీనికి తోడు ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700)లో ఏఎక్స్ 5 సెలెక్ట్ (AX5 Select),ఎంఎక్స్ 7 సీటర్ (MX 7-Seater), న్యూ బ్లేజ్(New Blaze) ఎడిషన్ కార్లు ఆవిష్కరించింది. ఇంకా ఎంఎక్స్ వేరియంట్లో ఆటోమేటిక్ వేరియంట్ కారును మార్కెట్లోకి తేవాలని భావిస్తోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) కారులో ఇన్ఫోటైన్మెంట్, ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ 10.25 అంగుళాలతో కూడిన వేర్వేరు స్క్రీన్లు ఉన్నాయి. అడ్రెనాక్స్ఎక్స్ యూజర్ ఇంటర్ ఫేస్, అలెక్సా బిల్ట్ ఇన్ ఫంక్షనల్లీ, సోనీ సౌండ్ సిస్టమ్, లెవెల్ 2అడాస్, పనోరమిక్ సన్ రూఫ్, వాయిస్ కమాండ్స్, అంబియెంట్ లైటింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 2024 ఎడిషన్ కారులో వెంటిలేటెడ్ సీట్స్, ఓఆర్వీఎంస్ విత్ మెమోరీ ఫంక్షన్, ఓటీఏ అప్ డేట్స్ విత్ 13 న్యూ ఫీచర్లు, న్యూ నపోలీ బ్లాక్ షేడ్ తదితర ఫీచర్లు జత చేశారు. ఇక తాజా రెండు అడిషన్లతోపాటు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) కారు తొమ్మిది రంగుల్లో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

