Mahindra | ముంబై, సెప్టెంబర్ 3: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన మాడళ్లపై రూ.3 లక్షల వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో థార్ ఆర్డబ్ల్యూడీ, స్కార్ఫియో, బొలెరో, ఎక్స్‌యూవీ400లపై రూ.3 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్లు పేర్కొంది.
వీటిలో ఎక్స్‌యూవీ400 మాడల్‌పై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్ కల్పిస్తున్న సంస్థ..థార్ 3-డోర్లు 2 డబ్ల్యూడీ, 4 డబ్ల్యూడీపై రూ.1.50 లక్షల వరకు, బొలెరోపై రూ.90 వేల వరకు, నియోపై రూ.84 వేలు, స్కార్ఫియో క్లాసిక్‌ను కూడా తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది.
పండుగ సీజన్ కంటే ముందుగానే సంస్థ ఈ భారీ రాయితీ ప్రకటించడం విశేషం. దీంతో థార్ రోక్స్ ధర రూ.12.99 లక్షల నుంచి రూ.20.49 లక్షల లోపు లభించనున్నది.