Maharashtra – Petrol | ముంబై పరిధిలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు.. కారణమిదేనా..?!
Maharashtra - Petrol | ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో పెట్రోల్, డీజిల్‌లపై మహారాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించింది.
Maharashtra – Petrol | ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో పెట్రోల్, డీజిల్‌లపై మహారాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించింది. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సమర్పించినప్పుడు ఈ సంగతి ప్రకటించింది. లీటర్ పెట్రోల్ మీద 65 పైసలు, లీటర్ డీజిల్ మీద రూ.2.60 వ్యాట్ తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ తెలిపారు. వ్యాట్ చార్జీల తగ్గింపు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఠాణె, నేవీ ముంబై నగర పాలక సంస్థల పరిధిలో పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ తగ్గింపు వర్తిస్తుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ.. ‘ముంబై రీజియన్ పరిధిలో డీజిల్ మీద 24 శాతం, పెట్రోల్ మీద 21 శాతం టాక్స్ తగ్గించాం. దీంతో లీటర్ డీజిల్ మీద రూ.2, లీటర్ పెట్రోల్ మీద 65 పైసలు పన్ను తగ్గుతుంది’ అని ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ తగ్గింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.200 కోట్ల ఆదాయం తగ్గుతుంది. ముంబై మినహా మిగతా మహారాష్ట్ర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉంటాయి. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
మరోవైపు, కర్ణాట ప్రభుత్వం పెట్రోల్ మీద 29.84శాతం, డీజిల్ మీద 18.44 శాతం వ్యాట్ పెంచేసింది. గోవా ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ చార్జీలు పెంచింది. అయితే, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మున్ముందు మరికొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ చార్జీలు సవరించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
Tata Motors | ఆరేండ్లలో 60 లక్షల కార్ల విక్రయాలు.. ఇదీ టాటా మోటార్స్ బ్లూ ప్రింట్ ..!
Maruti Suzuki Swift | మారుతి ‘సిగ’లో మరో మైలురాయి.. 30 లక్షలు దాటిన ‘స్విఫ్ట్’ సేల్స్..!
Bharti Airtel | ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్ల మోత.. 20 శాతం వరకూ పెంపు..
July Bank Holidays | జూలైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. .ఇవీ డిటైల్స్..!
Realme C61 5G | రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

