న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి( Richest Person ) ట్యాగ్ కోల్పోయారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. ఆయన స్థానంలో లూయీ విటాన్ మోయెట్ హెన్నెస్సీ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం ఈ ఫ్రెంచ్ కుబేరుడి మొత్తం సంపద విలువ 198.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.14.74 లక్షల కోట్లు)గా ఉంది. గతంలోనూ ఆర్నాల్ట్ ఈ సంపన్నుడి ట్యాగ్‌ను ఎంజాయ్ చేశారు. డిసెంబర్ 2019, జనవరి 2020, మే 2021, జులై 2021లోనూ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. మరోవైపు బెజోస్ సంపద విలువ 194.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.14.44 లక్షలు)గా ఉండగా.. స్పేస్ఎక్స్ చీప్ ఎలాన్ మాస్క్ 185.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13.74 లక్షల కోట్లు)తో మూడోస్థానంలో ఉన్నారు.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లూయిస్ విటన్ కంపెనీ ఫలితాలు విడుదల చేసినప్పుడే ఆర్నాల్ట్.. ఎలాన్ మాస్క్‌ను వెనక్కి నెట్టారు. 2021 తొలి త్రైమాసికంలో లూయిస్ విటన్ 1400 కోట్ల యూరోల ఆదాయాన్ని ఆర్జించింది. లూయీ విటాన్ మోయెట్ హెన్నెస్సీ కింద మొత్తం 70 బ్రాండ్లు ఉన్నాయి. లూయీ విటాన్తోపాటు ప్రముఖ బ్రాండ్లయిన గుచ్చి, క్రిస్టియన్ డియోర్, టిఫానీ, సెఫోరా కూడా ఈ సంస్థ బ్రాండ్లే.