హైదరాబాద్, నవంబర్ 10: చైనాకు చెందిన స్పోర్ట్స్‌కార్ బ్రాండ్ లోటస్.. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ మాడల్ ఎలెక్ట్రా ఎస్‌యూవీని గురువారం దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. మూడు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.2.55 కోట్లుగా నిర్ణయించింది. ఎలెక్ట్రా ఎస్ మాడల్ ధర రూ.2.75 కోట్లు, ఎలెక్ట్రా ఆర్ మాడల్ రూ.2.99 కోట్లు. దేశీయంగా లభిస్తున్న ఈవీ కార్లలో ఇదే అత్యంత విలువైన కారు కావడం విశేషం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బెంట్లీ షోరూం నుంచి వాహనాలను విక్రయిస్తున్నట్లు, వచ్చే ఏడాది ఢిల్లీలోనే తన తొలి షోరూంను ప్రారంభించాలనుకుంటున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కేవలం 2.95 సెకండ్లలో 100 కిలోమీటర్లు వేగాన్ని అందుకోనున్న ఈ ఎలెక్ట్రా ఆర్ మాడల్ పూర్తి బ్యాటరీ చార్జింగ్‌తో 600 కిలోమీటర్లు ప్రయాణించవచ్చును. ఎలెక్ట్రా, ఎలెక్ట్రా ఎస్ మాడల్ మాత్రం 4.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. ఈ కారులో వైర్లెస్ చార్జింగ్, ముందు సీట్‌ను 12 రకాలుగా మార్చుకోవచ్చును. అలాగే 112 కిలోవాట్ల బ్యాటరీలో కేవలం 20 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం చార్జింగ్ కానున్నది.