Fixed Deposits | ఎఫ్డీల్లో పెట్టుబడులు పెట్టనున్నారా.. అయితే స్వల్ప, దీర్ఘకాలిక డిపాజిట్లలో ఏది ఎంచుకోవాలి ?
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను ఎంచుకునే ముందు డిపాజిట్ చేసే మొత్తం, వడ్డీరేట్లతోపాటు దాని కాలపరిమితి కూడా ప్రాధాన్యతాంశమే. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఎఫ్డీలు.. మీ రాబడులపైనేగాక, మీ ఆర్థిక లక్ష్యాలపైనా ప్రభావం చూపుతాయి.
Fixed Deposits | ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను ఎంచుకునే ముందు డిపాజిట్ చేసే మొత్తం, వడ్డీరేట్లతోపాటు దాని కాలపరిమితి కూడా ప్రాధాన్యతాంశమే. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఎఫ్డీలు.. మీ రాబడులపైనేగాక, మీ ఆర్థిక లక్ష్యాలపైనా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు దీర్ఘకాలిక ఎఫ్డీలతో అధిక ఆదాయం, మరింత ద్రవ్యలభ్యత చేకూరుతుంది. దీనివల్ల మీ ఆర్థిక లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు. స్వల్పకాలిక ఎఫ్డీలతో తక్కువ సమయంలోనే మీ నిధుల్లో వృద్ధిని గమనించవచ్చు. సాధారణంగా ఇవి వారం రోజుల నుంచి రెండేండ్ల వరకుంటాయి. కనీస డిపాజిట్ మొత్తాలు తక్కువగా ఉండటం, మార్కెట్ లింక్డ్ రిస్కులు లేకపోవడం, స్వల్ప లాకిన్ పీరియడ్లు, పొదుపు ఖాతాల కంటే అధిక వడ్డీరేట్లు వీటి సొంతం.
దీర్ఘకాలిక ఎఫ్డీలు దాదాపు 2-10 ఏండ్ల వ్యవధితో ఉంటాయి. వీటి ప్లాన్లనుబట్టి అధిక వడ్డీరేట్లు, వృద్ధులకు ఎక్కువ రాబడి, రుణ సదుపాయం పొందే వీలు, పన్ను ప్రోత్సాహకాలుంటాయి. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి, నగదు అవకాశాల ఆధారంగా ఎఫ్డీ కాలపరిమితిపై ఓ నిర్ణయానికి రావడం ఉత్తమం. అయితే స్వల్పకాలిక ఎఫ్డీలకు వడ్డీరేట్లు మెరుగ్గా ఉండే వీలున్నది. బయట మార్కెట్లో లిక్విడిటీ సమస్యలున్నాయి. అంత సులువుగా రుణ లభ్యత లేదు. ఈజీ లోన్లకున్న మార్గాలనూ ఆర్బీఐ కఠినం చేస్తున్నది. బయటి మార్కెట్లో ఎంత సులభంగా లోన్లు లభిస్తే ద్రవ్యోల్బణం అంతగా పెరిగే అవకాశాలున్నాయి మరి. ఈ నేపథ్యంలో స్వల్పకాలిక ఎఫ్డీలు చేసేవారికి లాభదాయకంగానే పరిస్థితులుంటున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

