హైదరాబాద్, మే 1 : హైదరాబాద్‌కు సమీపంలో మేడ్చల్ వద్ద వరల్డ్ క్లాస్ బిస్కెట్ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది లోహియా గ్రూపు. ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ప్రస్తుతం నెలకు 1000 టన్నుల బిస్కెట్లు తయారుకానుండగా, వచ్చే నాలుగేండ్లలో ఈ సామర్థ్యాన్ని 5 వేల టన్నులకు పెంచుకోనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నాలుగేండ్లలో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది.