ముంబై, జూలై 27: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. గురువారం జీవన్ కిరణ్ (ప్లాన్ నం.870) పేరుతో ఓ కొత్త పాలసీని ప్రారంభించింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా ప్లాన్. ఈ పాలసీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) 512ఎన్353వీ01 అని ఓ ప్రకటనలో ఎల్ఐసీ తెలియజేసింది. అలాగే అదనపు ప్రీమియం చెల్లింపుల ద్వారా యాక్సిడెంటల్ డెత్ లేదా డిజబిలిటి బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ వంటివి అందుబాటులో ఉంటాయి. నిర్ణీత వ్యవధిపై మెచ్యూరిటీ/డెత్ బెనిఫిట్ పొందేందుకు సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుందని సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా, www. licindia.in వెబ్‌సైట్‌పై ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో సంస్థకు చెందిన ఏజెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థల నుంచి ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు.
జీవన్ కిరణ్ పాలసీ విశేషాలు